తాజాగా కీరవాణి తనయులు శ్రీ సింహ, కాలభైరవ లు మత్తు వదలరా చిత్రంతో పరిచమయ్యారు. ఎం.ఎం.కీరవాణి తనయుడైన శ్రీసింహ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి `మత్తు వదలరా` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది వరకే సింగర్ అయిన కాళభైరవ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన మైత్రి మూవీస్..మత్తు వదలరా సినిమా ను తెరకెక్కించింది. వైవిధ్యమైన కథనంతో, థ్రిల్లర్ నేపథ్యంతో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం బుధవారం విడుదలై పాజటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన పలువురు ప్రముఖులు చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు `మత్తువదలరా` సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా చిత్రబృందాన్ని అభినందించారు. ``మత్తువదలరా` ఒక ట్రెండీ ఫిల్మ్. సింహా నటన, కాలభైరవ నేపథ్య సంగీతం అద్భుతం. దర్శకుడు రితేష్ రానా మంచి ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులుగా కీరవాణి, వల్లీ గర్వించదగ్గ క్షణం. చిత్రబృందానికి అభినందనలు` అని రాఘవేంద్రరావు పోస్ట్ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa