సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'దర్బార్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జనవరి 9న దర్బార్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 3న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో నిర్వహిస్తారు. ఈ వేడుకకి తమిళ సూపర్ స్టార్..దర్బార్ హీరో రజనీకాంత్ కూడా హాజరవుతారు. ఈ మూవీని మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ స్వరాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa