రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు గా తెరకెకిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ఇప్పటికే దాదాపుగా 80శాతం మేర షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నది. వచ్చే యేడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ రూ. 400 కోట్లకు పైగా బిజినెస్ చేసుకున్నట్టు సమాచారం. ఇక ఏరియాల్లో చూసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమా దాదాపుగా రూ. 13 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసుకుంది. సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ కానీ, ఒక్క సీన్ కానీ బయటకు రాలేదు. అయినా.. పశ్చి మగోదావరి జిల్లాలో ఈ స్థాయిలో బిజినెస్ చేసుకోవడం అన్నది షాక్ ఇస్తోంది. ఈ మొత్తం తిరిగి రావాలంటే ప. గోదావరి జిల్లాలోని అన్ని థియేటర్స్ లో నెల రోజుల పాటు ఆర్ ఆర్ ఆర్ ఆడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa