దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన రజిని కాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ చాలా కాలం తరువాత పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రంలోని మూడవ సాంగ్ నేడు సాయంత్రం 6గంటలకు విడుదల కానుంది. నిఖార్సైన బ్రహ్మచారిని అనే ఈ సాంగ్ కి సాహిత్యం భాస్కర భట్ల అందించారు. ఇన్నో గెంగా ఈ పాటను పాడారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. నివేదా థామస్ కూడా ఓ రోల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa