ఆమె వెండితెరపై కనబడితే చాలు ఫ్యాన్స్‌కు మైమరపులా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభిమానులను తన మాయలో పడేసిన నటి సమంత.. రియల్‌గా కూడా ప్రజలకు ఎంతగానో సేవ చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను నడుపుతున్న ఈ మనసున్న భామ ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తుకు అండగా నిలుస్తోంది. అందుకే సమంతకు టీవీ9 నవ నక్షత్ర అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇక ఈ అవార్డు అందుకున్న సామ్ తన చిలిపి మాటలతో అందరిని ఆకట్టుకుంది.
ఎందరో మహామహుల సమక్షంలో ఈ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది. అయితే ఈ వేదికపై సత్కారాలు అందుకున్న అన్‌సంగ్ హీరోల స్ఫూర్తిదాయకమైన కథలను చూసిన తర్వాత తాను జీవితంలో సాధించిందేమీ లేదని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa