కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8వ తేదీన హైదరాబాదులో జరపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.
ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు సమాచారం. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే అవకాశం లభించడం పట్ల నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా .. సుభాశ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa