చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కోసం చిరంజీవి బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ సినిమాను కొరటాల శివ..చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు స్కోప్ లేకుండే. అందుకే ఈ సినిమాలో ఒక మాస్ బీట్ సాంగ్ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్‌కు మణిశర్మ మంచి ట్యూన్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవితో రెజీనా ఐటెం సాంగ్ చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెజీనా.. చేతలో సినిమాలు లేకపోవడంతో ఈ ఐటెం పాటకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించడం ఖాయం అని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa