సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తొలిరోజు దాదాపు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ప్రతిరోజూ పండగే రెండో రోజు నుంచి కూడా అదే దూకుడు చూపించింది. విడుదలై నెల రోజుల కూడా పూర్తి కావడంతో ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఈ చిత్రం నెల రోజుల్లో 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. సంక్రాంతి వరకు సినిమాలేవీ రాకపోవడంతో మూడు వారాల పాటు ఈ చిత్రం కుమ్మేసింది. రాశి ఖన్నా, రావు రమేష్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa