ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్కో రాజా మేకింగ్ వీడియో 2.0

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 07:01 PM

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న "డిస్కో రాజా" చిత్రం రేపు విడుదలకు సిద్ధమైంది. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా మేకింగ్ వీడియో 2.0 పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో రవితేజ అభిమానులకు మరింత ఊపుతెప్పించింది. హీరోయిన్ పాత్రలో నభా నటేష్ నటిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్, వెన్నెలా కిషోర్, బాబీ సింహా ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రజిని తల్లూరి నిర్మించిన ఈ చిత్రానికి వి ఆనంద్ ఎస్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం రేపు థియేటర్ లలో సందడి చేయనుంది. నేలా టికెట్’, ‘టచ్ చెసి చుడు’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అయిన తర్వాత, మాస్ మహారాజ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa