వంశీ పైడిపల్లి మహర్షి సినిమాలో స్టూడెంట్ కం కంపెనీ సీఈవో గా మహేష్ ని చూపించాడు. మూడు నెలల తర్వాత మొదలు కాబోతున్న వంశీ - మహేష్ సినిమాలో మహేష్ ఈసారి స్పై గా కనిపించబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. స్పై గా మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడని ఫిలింనగర్ టాక్. మరి మహేష్ ఈ స్పై పాత్ర చెయ్యడానికి ఎలా ఒప్పుకున్నాడో అంటూ మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే గతంలో మురుగ దాస్ డైరెక్ట్ చేసిన స్పైడర్ సినిమాలో మహేష్ స్పై గా నటిచడం, ఆ సినిమా ప్లాప్ అవడంతో.. మరోసారి మహేష్ స్పై పాత్ర అనే సరికి మహేష్ అభిమానులకి కంగారు పుడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa