ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా మొదటి నుండి 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ గా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ఇది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ కాదని... కానీ కొత్త తరహా ప్రేమకథ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కోసం బాలీవుడ్ నటి భాగ్యశ్రీ అమ్మ పాత్రకి దిగిందంట. ఇప్పటికే ప్రభాస్ - భగ్యశ్రీ పై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు పూర్తయిపోయాయి అని ఆమె షూటింగ్‌కి పేకప్ చెప్పేసి ముంబై కూడా వెళ్లిపోయింది అంటున్నారు. మరి పాన్ ఇండియా మూవీ అంటే.. అందులో ఖచ్చితంగా బాలీవుడ్ నటులు ఉండాల్సిందే కదా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa