ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ మూవీ నుంచి రేపు ఫస్ట్ లుక్ !

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 01:03 PM

హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్రీకారం’ . కొత్త  దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంప్రదాయకర రీతిలో ‘శ్రీకారం’ అనే టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది. 2020 మొదటి అర్థ భాగంలోనే ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మీక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ఆధునిక వ్యవ్యసాయ పద్దతులు అనే కాన్సెప్ట్ మీద ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa