గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూకంప కేంద్రం 23.65° నార్త్ లాటిట్యూడ్, 70.23° ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అధికారులు ప్రభావిత ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa