ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అజ్ఞాతవాసి’లో కనిపించబోతున్న అనిరుద్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2018, 02:49 PM

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. 9వ తేదీ మిడ్ నైట్ నుండి షోస్ ప్లాన్ చేసారు. సెన్సార్ సభ్యుల నుండి కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.


పవన్ ఈ సినిమా కోసం పాడిన పాట ‘కొడకా కోటేశ్వర రావు’ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. తాజా సమాచారం మేరకు చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అనిరుద్ గతంలో కూడా తాను సంగీత దర్శకత్వం వహించిన కొన్ని తమిళ సినిమా పాటల్లో మెరిసిన సంగతి విథితమే. ఈ నెల 5న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa