దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నది.. ఈ మూవీలో అతి కీలకపాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు.. అతడి భార్యగా శ్రీయా శరణ్ ను తీసుకున్నారు.. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. గతంలో అజయ్ , శ్రీయాలు బాలీవుడ్ మూవీ దృశ్యంలో నటించారు.. ఇప్పుడు తెలుగులో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు.. ఈ మూవీలో బ్రిటన్ రంగస్థల కళాకారిణి ఒలివియో మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ లు హీరోయిన్స్… ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్ టాక్..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa