"అశ్వద్ధామ" చిత్ర దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ - ``ఇక్కడికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు. మూవీ ఓపెనింగ్ రోజు ఆయన వచ్చారు. ఇప్పుడు రిలీజ్ సందర్భంగా మళ్లీ మాకు సపోర్ట్‌గా వచ్చారు. ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్ మరవలేనిది. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే..ఓ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు
ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ - ``మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ఇది 18వ సినిమా. ప్రతి సినిమాకు నేను ఎదొఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. తనలోని యాక్టర్‌కిపోటీ పడేలా రైటర్, తన లోని రైటర్‌కు పోటీగా యాక్టర్ అంటూ చేశాడు శౌర్య. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు. డిజిటల్ పబ్లిసిటీ క్రెడిట్ నా ఒక్కడిదే కాదు. టీమ్ అందరిదీ. సహకరిస్తున్న మీడియాకు ధన్యవాదాలు’’ అన్నారు .
నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ - ‘‘సమాజంలోమహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించే వ్యక్తిత్వం ఉన్నావాడు ‘అశ్వథ్థామ’. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ఒకప్పుడు భాగ్యరాజ్, రాజేంద్రన్ వంటివారు వారే కథ రాసుకుని హీరోగా రాసేవారు. ఈ సినిమాకు నాగశౌర్య అలా చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరామన్ మనోజ్, ఎడిటర్ గ్యారీ, డైలాగ్ రైటర్ పరశురామ్,కో డైరెక్టర్ అంకిత్, శ్రీనివాసరెడ్డి ప్రసంగించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నాగశౌర్య, మెహరీన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డిజిటల్: ఎం.ఎస్.ఎస్. గౌతమ్, డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్, యాక్షన్: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, కథ: నాగశౌర్య, కో డైరెక్టర్ అంకిత్, శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: రమణ తేజ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa