తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక స్టైలిష్ విలన్‌గా అంతకు మించిన పేరును ప్రముఖ నటుడు జగపతిబాబు సంపాదించుకున్నాడు. విలన్‌గా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలూ మంచి కలెక్షన్లను సాధించాయి. అయితే తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. వైట్ షర్ట్‌తో స్టైలిష్ లుక్‌తో ఉన్న పిక్‌ను పోస్ట్ చేసిన జగ్గూభాయ్.. ‘‘ఇతరుల దగ్గర ఏమున్నది అని చూడకు, నీ దగ్గర ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.. ఆ తరువాత నీ లక్ష్యం గొప్పగా ఉండేలా చూసుకో’’ అని ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa