బల్కి దర్శకత్వంలో స్టార్ కమెడియన్ సంతానం హీరోగా తెరకెక్కిన 'సర్వర్ సుందరం' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమెడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో హీరోగా ఆడియన్స్‌ని అలరించనున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నట్లుగానూ, ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. సంతానం, వైభవి, రాధా రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: బల్కి, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్; సంగీతం: శీలంబరసం, కెమెరామెన్: అభినందన్ రామానుజం, ఎడిటింగ్: ఆంథోని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa