రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2020జులై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదావేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ బడ్జెట్ రూ.400 కోట్లని నిర్మాత డివివి దానయ్య ఇదివరకే తెలిపారు. దీంతో సినిమా హక్కులను భారీ ధరలకు అమ్మడం ఖాయమని అర్థమైంది కానీ ఎంత ధరలకి అమ్ముతారనే విషయమై అందరిలోనూ ఆసక్తి రేగింది. సినిమా సగంలో ఉండగానే హక్కుల్ని అమ్మడం స్టార్ట్ చేశారు. ముందుగా పెద్దదైన నైజాం హక్కులు రూ.75 కోట్లకు అమ్ముడవగా కర్ణాటక రైట్స్ రూ.50 కోట్లు, సీడెడ్ రూ.40 కోట్లు, వైజాగ్ రూ.30 కోట్లు, ఓవర్సీస్ రూ.75 కోట్లకు విక్రయించారట. ఈ మొత్తం కలిపి రూ.270 కోట్ల వరకు తేలగా ఇంకా బాలీవుడ్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఇంకొన్ని ప్రాంతాల రైట్స్ అమ్మాల్సి ఉంది. అవి కూడా పూర్తేతే సులభంగా రూ.400 కోట్లను దాటిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa