శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి మహిపాల్ రెడ్డి దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్" ఈ సినిమా నుండి “ఓసి రాకాసి...” అనే మొదటి పాటను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఈ పోస్టర్ సినిమాలో ఈ పాట ను నేనే స్వయంగా పాడాను, అటువంటి నేను పాడిన పాటను నేనే విడుదల చేసుకోవడం నాకు చాలా కొత్తగా, ఆనందంగా ఉంది. నాకు ఈ పాట పాడేందుకు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శాండీ అద్దంకి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సాంగ్ అందరూ వినండి, చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నా అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa