ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 01:01 PM

జూబ్లిహిల్స్ లోని  అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ  తదితర శాఖల అధికారులతో  సమీక్షించిన మంత్రి. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని.  కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు. సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని , సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు  త్వరితగతిన అనుమతులు సేకరించాలని ఆదేశించారు.  ఆఫ్ డి సి  ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతాం . పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు  తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం అని అన్నారు . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa