ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ మూవీకి డిఫెరెంట్ టైటిల్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 06:18 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో పింక్ సినిమా రీమేక్ మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్. ఇది పవన్ కళ్యాణ్ 27వ సినిమా. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఏడాది పాటు కూర్చుని క్రిష్ రాసుకున్న కథ ఇది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ పూర్తైన తర్వాత పూర్తి డేట్స్ క్రిష్ చిత్రానికి కేటాయించబోతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం రాజకీయాల కోసం 5 రోజులు సినిమాలకు దూరం కానున్నాడు పవన్. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీ నుంచి షూటింగ్‌లో పాల్గొంటాడు పవన్. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాకు సంబంధించి టైటిల్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ దీనికి వీరూపాక్షి అనే డిఫెరెంట్ టైటిల్ వినిపిస్తుంది. ఇందులో పవన్ పాత్ర పేరు వీర. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. విజువల్‌గా కూడా చాలా రిచ్‌గా ఉండబోతుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ కూడా నిర్మించారు. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa