పవన్ 'పింక్' రీమేక్ కన్నా ఎక్కువగా క్రిష్ కాంబోలో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే సినిమాపై మాత్రం పిచ్చ క్రేజ్, అంచనాలు ఉన్నాయి. మొఘల్ రాజవంశం యొక్క నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రను పోషిస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరును 'వీరా' అని లాక్ చేసి... సినిమా టైటిల్ 'విరూపాక్ష' అని పెడితే ఎలా ఉంటుంది అని దర్శకనిర్మాతలతో పాటుగా పవన్ కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.'విరూపాక్ష' టైటిల్ అయితే ఈ కథకి పర్ఫెక్ట్ గా సెట్ గా అవుతుంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa