‘వరల్డ్ ఫేమస్ లవర్’గా ప్రేమికుల రోజున థియేటర్లకు రానున్న విజయ్ దేవరకొండ తన హిందీ డెబ్యూ మూవీలో అనన్యపాండేతో జోడీ కట్టనున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఇటీవలే ముంబయిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ‘ఫైటర్' టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ఆయన థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ విడుదల చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. విజయ్ కు ఇది హిందీ డెబ్యూ మూవీగానే చెప్పుకోవాలి. ఈ చిత్రంలో అనన్యపాండేను హీరోయిన్ గా ఖరారు చేశారు కరణ్ జోహార్. కరణ్‌జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో అనన్య బాలీవుడ్ కి పరిచయమైంది. దాంతో ఆయనే అనన్యపాండే పేరును సూచించారట. ఈ చిత్రంలో విజయ్ వినూత్నమైన గెటప్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనన్య విజయ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని, మార్చి మధ్యలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొనబోతోందని చిత్రయూనిట్ తెలిపింది. అనన్య ప్రస్తుతం ‘ఖాలీపీలీ’ చిత్రీకరణలో ఉంది. ఇందులో ఇషాన్ ఖట్టర్ కూడా నటించారు. ఈ చిత్రం 'టాక్సీవాలా' చిత్రానికి రీమేక్. యాదృచ్ఛికంగా, టాక్సీవాలా తెలుగులో విజయ్ దేవరకొండ నటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa