ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంద మంది నిరుపేద పిల్లలను విమానం ఎక్కిస్తున్న సూర్య!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 07:17 PM

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తమిళ్ లో రూపొందుతున్న చిత్రం ‘సూరారై పొట్టూర్’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. పేరుతో తెరకెక్కనుంది. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది ఈ చిత్రం. ఇటీవల విడుదల చేసిన మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. జేబులో ఆరు వేల రూపాయలు పెట్టుకుని పట్టణం వచ్చిన వ్యక్తి విమాన కంపెనీని ఎలా స్థాపించాడు? ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చూపించనున్నారు. సామాన్యులు విమానం ఎక్కాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో... ఈ చిత్రం కథకు అనుగుణంగా, రేపు ఉదయం చెన్నై విమానాశ్రయంలో వందమంది నిరుపేద పిల్లలను విమానం ఎక్కించేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. వీరంతా విమానం ఎక్కడం ఇదే తొలిసారి. విమానంలో చెరియా మరియు చుట్టుపక్కల అరగంట పాటు, సూర్యతో పాటు మిగిలిన బృందంతో పిల్లలను తీసుకెళ్తారు. ఇది వారి మొట్టమొదటి విమాన అనుభవం. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa