ప్రస్తుతం బాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది నటి కైరా అద్వాని. ఈ భామ బ్రైడల్ లుక్‌ను బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ ఫిబ్రవరి నెల కవర్ పేజీపై ముద్రించింది. ఈ సందర్భంగా ఆమెను బ్రైడల్ లుక్‌లో ఫోటో షూట్ చేశారు. ఇకపోతే ఇదే బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆడ, మగ రిలేషన్‌షిప్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది. తాను ఎవ్వరితో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. రిలేషన్‌షిప్ లాంటివి తాను పెద్దగా నమ్మనని కూడా చెప్పి షాకిచ్చింది. అంతేకాదు ఓ సారి రిలేషన్‌షిప్ పెట్టుకుంటే దానికే బాండింగ్ అయి ఉండాలని, ఆ రిలేషన్ గురించి బయట చెప్పుకోవడానికి భయపడకూడదని తెలిపింది. ఆడ, మగ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో కూడా వివరించింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అంటోంది. కాబోయే పార్ట్‌నర్‌తో డేటింగ్ చేయడంలోనూ తప్పులేదంటోంది . అయితే రిలేషన్‌షిప్ బ్రేక్ చేయకుండా ఒక్కటై ఎప్పటికీ కలిసుండాలని చెప్పింది. పెళ్లి తర్వాత భర్తతో సన్నిహిత సంబంధం గురించి ఎక్కడైనా మాట్లాడేటపుడు భయపడొద్దని .. భర్తతో సన్నిహిత సంబంధం గురించి తల్లి దగ్గర ప్రస్తావన వచ్చినా నాచురల్‌గా పంచుకోవాలని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa