సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సినిమా ‘సీటీమార్’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోపీచంద్ లుక్, తమన్నా లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్ గా చేస్తున్నారు. ఆమె రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందట. గోపీచంద్ ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నాడు. అయితే తమన్నా – గోపీచంద్ మధ్య గేమ్ కి సంబంధించి మంచి వార్ ఉంటుందట. కాగా రీసెంట్ గా మొదలైన షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa