శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్ఎస్ సి క్రియేషన్స్ పతాకంపై శ్రీనుతెలుగు దర్శకత్వంలో సంపత్ శ్రీను, కె. లక్ష్మణరావు నిర్మిస్తున్నచిత్రం `విన్నర్స్ ట్రిప్`. మహి, సోనా పాటిల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రం టీజర్ ని పిబ్రవరి12న ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ - "ఒక చిన్న సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడమే ఒక విజయం. ఈ టీమ్ సంతోషం చూస్తుంటే కచ్చితంగా గెలవాలనే తపనతోనే ఈ సినిమా తీశారనిపిస్తోంది. తప్పకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతున్నాను. దర్శక నిర్మాతలకి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్" అన్నారు.
దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ - "ముందుగా ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ చిత్రీకరణ పూర్తి అయినతర్వాత మా ప్రొడ్యూసర్ గారి సలహా మేరకు `విన్నర్ ట్రిప్` అయితే యాప్ట్ అనిపించి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ఒక ఎఫ్ ఎమ్ రేడియో కాంటెస్ట్ లో గెలిచిన విజేతలందరిని ఒక ట్రిప్ కి తీసుకెళ్తే అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అందులోనుండి ఎంతమంది బయటపడ్డారు అనేది కథాంశం" అన్నారు.
హీరో మహి మాట్లాడుతూ - "మా నిర్మాత సంపత్ గారు, లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ నుండి మాతో ట్రావెల్ అవుతూ మాకు ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. త్వరలో మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి" అన్నారు. హీరోయిన్ సోనా పాటిల్ మాట్లాడుతూ - "ఒక కొత్తతరహా చిత్రం ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకి, మా టీమ్ అందరికి ధన్యవాదాలు" అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి దన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa