'ఆర్.ఆర్.ఆర్' విషయంలో ఎలాంటి న్యూస్ విడుదలయిన తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందులోనూ అది ఎన్టీఆర్, చరణ్ సాహసాల విషయం అయితే అది మరింత ఎక్కువవుతుంది. ఇక 'ఆర్.ఆర్.ఆర్' లో పులితో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్స్ సూపర్ అంటూ ఎప్పటినుండో ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. దానికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది కూడా. అయితే ఆ క్రేజీ ఫైట్ కోసం ఎన్టీఆర్ చాలా రిస్క్ చేశాడట. ఈ యాక్షన్ సీన్ కోసం రాజమౌళి నిజమైన పులిని వాడారట. ఎన్టీఆర్ - పులి క్లోజ్ యాక్షన్ సన్నివేశాలను గ్రాఫిక్ చేయనున్న రాజమౌళి... ఎన్టీఆర్ పులికి ఎదురుపడే సన్నివేశాలలో మాత్రం నిజమైన పులిని ఉపయోగించారట. అయితే ఈ కష్టతరమైన సన్నివేశాలను నిపుణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బంధించబడిన పులితో చాల దగ్గరగా చిత్రీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. 'ఆర్.ఆర్.ఆర్' లో పది నిమిషాలకు పైగా ఉండే ఈ సన్నివేశం గూస్ బంప్స్ కలిగించేలా ఉంటుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa