వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుది. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నేడు భీష్మ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా గల ఈ చిత్ర ట్రైలర్ సరికొత్తగా ఉంది. భీష్మలో నితిన్ రష్మిక ల రొమాంటిక్ ట్రాక్ తో పాటు, సోషల్ మెస్సేజ్ కూడా ఉందని అర్థం అవుతుంది. లాభాపేక్షలతో కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి హెబ్రీడ్ పంటలు పండించడం వలన ప్రజారోగ్యానికి ఎంత హాని జరుగుతుంది అనేది చెప్పినట్లు ఉన్నారు. ఇక అశ్వథామ చిత్రంలో సైకో డాక్టర్ గా చేసిన జిష్షు సేన్ గుప్త భీష్మలో ప్రధాన విలన్ పాత్ర చేశారు. మొత్తానికి భీష్మ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
The trailer is hereeeee! I just watched the trailer and I really liked it - Tell me, did you guys like it too?#Bheeshmahttps://t.co/Wy7GJ3Hrbt@actor_nithiin @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @adityamusic
— Rashmika Mandanna (@iamRashmika) February 17, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa