ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పల్లవి నువ్వు సూపర్..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2020, 07:01 PM

కొన్నాళ్ల క్రితం సాయి పల్లవి 'పడి పడి లేచే మనసు' సినిమా చేసినప్పుడు ఆ సినిమా నిర్మాత సాయి పల్లవికి పారితోషికంలో 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూశాడట. సినిమాకి కలెక్షన్స్ రాకపోవడంతో... ఆ నిర్మాత ఇస్తా అన్నా 40 లక్షలను సాయి పల్లవి వద్దనేసిందట. తనకి డబ్బు కాదు.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెప్పడమే కాదు.. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా.. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే.. అని తన ఉదారత చాటుకుంటుంది. అసలు సంతోషంగా, ఆత్మసంతృప్తితో బతికితే చాలు.. విలువలు చంపుకుని పని చేయడం అనేది నాకు నచ్చదని చెప్పి హీరోయిన్స్ అందరిలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈ పల్లవి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa