ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన రైజా విల్సన్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 09:01 AM

నటి   రైజా విల్సన్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా  వేలంటైన్స్‌ డే సందర్భంగా తన ప్రేమికుడి గురించి  వెల్లడిస్తానని ప్రకటించింది. దీంతో  రైజా లవర్‌ ఎవరో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ చాలా ఆతృతగా ఎదురుచూశారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌, నటి ఓవియా కూడా అతడెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని వీడియో సందేశమిచ్చారు. అయితే రైజా వేలంటైన్స్‌ డేకి బయటపెట్టిన విషయం ఆమె ప్రేమ గురించి కాదు. ఆమె నటించబోయే కొత్త సినిమా గురించి అని తెలుసుకుని ఫ్యాన్స్‌ డీలా పడ్డారు. కొందరైతే సినిమా ప్రమోషన్ల కోసం ఇలాగా చేసేదంటూ విమర్శించారు కూడా. ఇకపోతే రైజా నటిస్తున్న కొత్త సినిమాకి ‘లవ్‌’ అనే టైటిల్‌ పెట్టారు. కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు బాస్కో ప్రభు తెరకెక్కిస్తున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa