దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వి’. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే వి మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కావడంతో పాటు, నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉండే సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నాడు. మరో హీరో సుధీర్ వి మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. చిత్ర షూటింగ్ సైతం మలేసియా, మనాలి వంటి ప్రదేశాలలో నిర్వహించారు. నిన్న ఈ చిత్రం టీజర్ విడుదల తరువాత తారాస్థాయికి చేరాయి. సీరియస్ పోలీస్ అధికారికి, డేంజర్ కిల్లర్ కి మధ్య నడిచే థ్రిల్లింగ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. సెన్సిబుల్ సీరియస్ పోలీస్ సుధీర్ కి సీరియల్ కిల్లర్ నాని విసిరే ఛాలెంజ్ లు, వీరి మధ్య నడిచే ఇగో వార్ ప్రధానం ఈ చిత్రం తెరకెక్కింది. ఇక వీరి మధ్య ఛేజింగ్స్ మరియు ఫైటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి నాని వి సరికొత్తగా ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa