సంక్రాంతి తరువాత ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. గత వారం విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫెమస్ లవర్' కూడా ఆశించిన రీతిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇక తాజాగా నితిన్ - రష్మీకల 'భీష్మ' సినిమాపైనే ట్రేడ్ నిపుణులు, ప్రేక్షకుల ఆశలు పెట్టుకున్నారు. పాజిటివ్ బజ్ ఉన్న ఈ చిత్రం మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది. ఈ చిత్రం యొక్క అన్ని ఏరియాల హక్కులు, నాన్-థియేట్రికల్ హక్కులతో సహా 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక చిత్రం విడుదలకు ముందే భీష్మ నిర్మాత 10 కోట్లు ప్రాఫిట్ సంపాదించినట్లుగా తెలుస్తుంది. 'భీష్మ' సినిమాకి 25 కోట్ల బడ్జెట్ పెట్టారని.. అలా చూసుకుంటే 10 కోట్లు లాభమొచ్చినట్లే అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa