ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మోకింగ్ కిల్స్ .. కానీ కింద స్మోక్ చేస్తున్నవాడు ఇంకా వేగంగా చంపేస్తాడు : నాని

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 03:39 PM

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా రూపొందింది. నాని - సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నివేద థామస్, అదితీరావు నాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబును .. సీరియల్ కిల్లర్ గా నానీని చూపిస్తూ, వాళ్లిద్దరికీ సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.


ముఖ్యంగా నాని డిఫరెంట్ లుక్ కి .. డైలాగ్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషం. ఈ సినిమాలో కిల్లర్ గెటప్ లో తను స్మోక్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన నాని, 'స్మోకింగ్ కిల్స్ .. కానీ కింద స్మోక్ చేస్తున్నవాడు ఇంకా వేగంగా చంపేస్తాడు' అని ఓ సీరియస్ కొటేషన్ పెట్టాడు. ఇలా తన పాత్రకి సంబంధించి నాని మరింత క్లారిటీ ఇచ్చాడు. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa