డైరెక్టర్ సందీప్ వంగ డైరక్షన్లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం డెవిల్ పేరుతో బాలీవుడ్‌లోనే మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ మూవీ పూర్తయిన తర్వాత మళ్లీ టాలీవుడ్‌కే రావాలని సందీప్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్‌తో తదుపరి సినిమా తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ప్రభాస్ కు సందీప్ ఓ కథను చెప్పడం.. దానికి ప్రభాస్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రభాస్‌తో డార్క్ థ్రిల్లర్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి డెవిల్ అనే టైటిల్ పెట్టాలనే అనుకుంటున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa