యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ నందు రామ్ చరణ్ మరియు అజయ్ దేవ్ గణ్ లతో పాటు ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరి 8న విడుదల కానుంది. ఎన్టీఆర్ తెరపై కనిపించి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. దీనితో ఆయన ఫ్యాన్స్ మహా బెంగపెట్టుకున్నారు. ఐతే ఎన్టీఆర్ ని వెండితెరపై మిస్సవుతున్నవారికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఒక గుడ్ న్యూస్ పంచారు. శివరాత్రి కానుకగా ఈనెల 21న ఎన్టీఆర్ మూవీ వెండితెరపై ప్రదర్శించనున్నారు. 2018లో దసరా కానుకగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన అరవింద సమేత వీర రాఘవ మూవీని హైదరాబాద్ , ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు గల మయూరి థియేటర్ లో రాత్రి 11:45 నిమిషాలకు స్పెషల్ షో వేస్తున్నారు. శివరాత్రి జాగరణ కొరకు ఈ స్పెషల్ షో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ని వెండి తెరపై చూసి ఆనందించాలని ఆశపడే వారు పండుగ రోజు మయూరి థియేటర్ కి వెళ్లడమే. ఇక నేడు త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ ల మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు. నిర్మాతలు దీనిపై నిన్న హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
On the occasion of Maha Shivarathri a special show of @tarak9999‘s #AravindaSametha is being Screened at Sri Mayuri Theater Rtc x roads on 21st Feb at 11:45PM. Show is being organised by @NtrMurali9999
Grab your tickets - https://t.co/Rgl8CLs3Y4 #Trivikram @MusicThaman pic.twitter.com/PWjrWtiQOx
— Haarika & Hassine Creations (@haarikahassine) February 18, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa