ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత భావోద్వేగభరిత పోస్ట్...

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 12:47 PM

సినీ నటి స‌మంత ప్రీ స్కూల్ బిజినెస్‌ ప్రారంభించ‌నుంది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని తెలుపుతూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి ఆమె ఈ స్కూల్ ప్రారంభిస్తుంది.


దీనికి ఏకం లెర్నింగ్ సెంటర్‌ అని పేరు పెట్టింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఈ నెల 22న ప్రీ స్కూల్ ఏకం లెర్నింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని ఆమె తెలిపింది. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ స్కూల్‌ ప్రారంభించడం కోసం తాము ఏడాదిగా కష్టపడుతున్నామని, చివరకు ప్రారంభమవుతోందని భావోద్వేగభరితంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామని చెప్పింది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa