‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో మొదలైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక కాస్త బ్రేక్ అనంతరం ఇటీవలే తిరిగి మొదలైంది. హైదరాబాద్లోని పలు లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు టీమ్. వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త తరహా ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రేసు గుర్రం, లక్ష్మీ, లక్ష్యం’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం అమెరికాలో ఒక షెడ్యూల్ జరపనున్నారు. ‘అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, ఆదిత్య వర్మ, ఫేమ్ రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa