విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. విజయ్ దేవరకొండ విజయాలకు బ్రేక్ వేసింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి చేస్తున్న చిత్రమిదే. కథ బాగా నచ్చడంతో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా చేరారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్‌కోసం పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా షూటింగ్‌లో హీరోయిన్ అనన్య పాండే వచ్చే చేరింది. ఈ చిత్రంలో ఇంకా రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను నటిస్తున్నారు. ఛాయాగ్రహణం విష్ణు శర్మ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa