ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘు కుంచె

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 01:01 PM

బుల్లితెరపై యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన రఘు కుంచె , ఆ తరువాత గాయకుడిగా కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. ఆ తరువాత సంగీత దర్శకుడిగా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.


తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. దర్శకుడు పూరితోను .. హీరో ప్రభాస్ తోను నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. 'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్ నేను పాడవలసింది. కానీ ఆ సమయంలో నాపై పూరి అలగడం వలన నేను ఆ పాటను పాడలేకపోయాను. ఇక ప్రభాస్ 'బంపర్ ఆఫర్' ఆడియోకి కూడా వచ్చాడు. 'ఎందుకే రవణమ్మ .. ' సాంగును భలేగా చేశావ్ డాళింగ్' అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ప్రభాస్ మనసు ఒక వైట్ పేపర్ లాంటిది. ఆ మనసులో ఎలాంటివి వుండవు. సెట్లో వున్న వారికి ఫుడ్ తెప్పించి ఆప్యాయంగా వడ్డించే గొప్పమనసు ఆయన సొంతం" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa