అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘అల..వైకుంఠపురములో’. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డే మరోసారి ఆడిపాడింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టి బన్నీ కెరిర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.
అయితే తాజాగా బన్నీ ఈ సినిమా ద్వారా మరో అరుదైన ఘనత సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఫిబ్రవరి 27వ తేదిన ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇండియాలోనే టాప్ టెన్ మూవీస్ లిస్టులో విడుదలైన మొదటి రోజే అలవైకుంఠపురంలో సినిమా చోటు దక్కించుకుంది. ఈ చిత్రం రెండు రోజులకే నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా టాప్ ప్లేస్‌లో నిలబడ లేదు. అయితే నెట్‌ప్లిక్స్‌లో అలవైకుంఠపురంలో టాప్ ప్లేస్ దక్కించుకోవడంతో బన్నీ మరో రికార్డ్ సృష్టించాడనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa