ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహం బ్రహ్మాస్మి సినిమా లాంచ్ కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2020, 08:04 PM

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మూడేళ్ల విరామం తర్వాత "అహం బ్రహ్మాస్మి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్  విడుదలైంది. నుదుటన విభూతి..మధ్యలో నామం పెట్టుకుని మూడు భిన్న పార్శ్వాల్లో ఉన్న మంచు మనోజ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమా రేపు లాంచ్ అవ్వబోతుంది.


రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ మరియు చాలా మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa