దర్శకుడు వెంకటేశ్ మహా పేరు వినగానే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న ఆయన, సత్యదేవ్ ప్రధాన పాత్రధారిగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ ఫొటోగ్రాఫర్ గా కనిపించనున్నాడు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియోను వదిలారు.
"నింగి చుట్టే మేఘం ఎరుగదా ఈ లోకం గుట్టూ .. మునిలా మెదలదు నీ మీదొట్టు .. కాలం కదలికలతో జోడీకట్టు .. " అంటూ ఈ పాట సాగుతోంది. బిజిబల్ సంగీతం .. విశ్వ సాహిత్యం .. విజయ్ ఏసుదాస్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ప్రధాన పాత్రను ప్రకృతికిస్తూ, అనుబంధాలు .. అనుభూతుల కలయికగా ఈ కథ సాగనున్నట్టు ఈ పాటను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ningi Chutte Lyrical | Uma Maheswara Ugra Roopasya | Satyadev | Bijibal ... https://t.co/sLBFTeUlg5 via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 7, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa