ఇటు హీరోయిన్ అనన్య పాండే, అటు నిర్మాత ఛార్మి.. ఇద్దరి మధ్యలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇక ఆ పక్కనే మన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్.. ఇలా అందరూ కలిసి ముంబైలో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ భాగమై చేస్తున్న సినిమా ఫైటర్ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అంతా కలిసి పార్టీ చేసుకున్నారు.సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా ముంబైలోనే పూర్తిచేసిన చిత్రయూనిట్.. అది విజయవంతంగా పూర్తిచేసి ముంబైకి బై బై చెప్పింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంతా కలిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు.ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో అందరూ కలిసి లాస్ట్ డే ఈవెనింగ్ ఎంజాయ్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సహా చిత్రయూనిట్ అంతా హుషారుగా కనిపిస్తోంది. ఛార్మి, అనన్యలతో కలిసి మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు మన విజయ్ దేవరకొండ.ఈ మేరకు ఈ పార్టీలో దిగిన పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఛార్మి.. ''మీ అందరితో పార్టీ ఫుల్లుగా ఎంజాయ్ చేశా. అందమైన సాయంత్రాన్ని అందమైన మనుష్యులతో సరదాగా గడిపా'' అంటూ ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఖుషీ అవుతూ 'ఫైటర్' హిట్ ఖాయం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa