నాని 'హిట్' 2 ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట. అయితే హిట్ సినిమా హీరోగా విశ్వక్ సేన్ నేచురల్ నటనకు మంచి మార్కులు పడడమే కాదు.. ఆ కేరెక్టర్ కి విశ్వక్ సేన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడన్నారు. అయితే తాజాగా హిట్ 2 లో విశ్వక్ సేన్ హీరోగా చేసే అవకాశం లేదంటున్నారు.ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకునే విశ్వక్ సేన్ సీక్వెల్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు.. అలాగే చేసిన పాత్రని మరోసారి చెయ్యకూడదని విశ్వక్ అభిప్రాయమాట. అలా అయితే హిట్ సీక్వెల్ కోసం మరో నటుడిని వెతకాలి. అలాగే దర్శకుడు కూడా మారినా మారొచ్చు.. కానీ నాని మాత్రం హిట్ సీక్వెల్ తియ్యడం పక్కా అంటున్నారు. ఒకవేళ హిట్ 2 కథ బాగా నచ్చితే.. కథలో కొత్తదనం, పాత్రలో వైవిద్యం ఉంటే, విశ్వక్ సేన్ చేసినా చెయ్యొచ్చు అంటున్నారు.