శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా 'లవ్ స్టోరీ' అనే ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని "ఏయ్ పిల్లా" ఫుల్ లిరికర్ వీడియోను ఈరోజు ( మార్చి 11న) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ సాంగ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుల వ్యవస్థకి సంబంధించి సున్నితమైన సమస్యను శేఖర్ డీల్ చేయబోతున్నారట. కుల ఆధారిత సమస్యనే ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యంగా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇద్దరు ప్రేముకుల వెరీ వేరు కులాల కారణంగా తమ ప్రేమకథలో సమస్యలను ఎదురుకునే కథలు ఇప్పటికే చాల చూశాం, అయితే శేఖర్ కమ్ముల మాత్రం ఈ సినిమాలో ఈ అంశాన్ని కాస్త కొత్తగా చూపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు నిర్మిస్తుండగా..ప్రవీణ్ సి హె మ్యూజిక్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa