'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ రెండు చిత్రాలు అంగీకరించారు. ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా కోసం భారీ మార్కెట్ సెట్ వేశారు. ఇందుకోసం 2 కోట్లను ఖర్చు చేశారని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో 150 మంది పనివాళ్లు ఈ సెట్ ను పూర్తి చేస్తున్నారని అంటున్నారు.1980 నేపథ్యంలో రూపొందే కథ కావడం వలన, ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే ఈ సెట్ ను వేశారట. విలన్ గ్యాంగును తరుముతూ ప్రభాస్ ఈ మార్కెట్ లో పరిగెడతాడట. ఆ సీన్ ను రెండు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ రెండు రోజుల షూటింగు కోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa