ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ సినిమా కోసం బయ్యర్లు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా మార్కెట్ బాగా జరిగింది. తమిళంలో క్రితం ఏడాది విజయాన్ని సాధించిన 'తడమ్' కి ఇది రీమేక్. ఆ సినిమాలో అరుణ్ విజయ్ చేసిన పాత్రను, తెలుగులో రామ్ చేస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ మొదలైపోయింది. ఆంధ్రాకి 9 కోట్ల రేషియోలో ఇచ్చారట. సీడెడ్ కి 4 కోట్ల రేషియోలో ఇచ్చారట. నైజామ్ కి సంబంధించిన బిజినెస్ డీల్ గురించి తెలియవలసి వుంది. ఇంతవరకూ వచ్చింది మంచి రేటేనని చెబుతున్నారు.ఇంతకుముందు రామ్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సాధించడం, ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు. అంతేకాదు .. ఈ సీజన్ లో సరైన సినిమా లేకపోవడం కూడా, ఈ స్థాయి బిజినెస్ జరగడానికి కారణమైందని చెబుతున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. నివేద పేతురజ్ .. అమృత అయ్యర్ కథానాయికలుగా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa