ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హిట్' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2020, 03:34 PM

విస్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన తాజా చిత్రం 'హిట్'. ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. టైటిల్ కు తగినట్టుగానే 'హిట్' అనిపించుకుంది. ఇక వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్, ఎంగేజింగ్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక అటు తరువాత కూడా అదే జోరుతో దూసుకుపోతూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. 'హిట్' చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అందరూ లాభాల బాట పట్టారు. అయితే కరోనా వైరస్ భయంతో చాలా మంది థియేటర్లకు రావడం మానేసారు కాబట్టి.. అదొక దెబ్బ అని చెప్పాలి. లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చూడాలి..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa